నాగ చైతన్యను ఇంటర్వ్యూ చేసిన సమంత..

46
samantha

అక్కినేని సమంత ‘ఆహా’ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో సామ్ జామ్ అని సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ అమ్మడు చిరంజీవి, విజయ్ దేవరకొండ, రానా, అల్లు అర్జున్, తమన్నాలను ఇంటర్వ్యూలు చేసింది. తాజాగా ఇపుడు తన భర్త నాగ చైతన్యను ఇంటర్వ్యూ చేసింది. వీరిద్దరు ఈ షోలో జంటగా దర్శనమిచ్చారు.

భార్య హోస్ట్ చేసే ప్రోగ్రామ్‌కు భర్త గెస్ట్‌గా రావడం బహుశా.. తెలుగు ఇండస్ట్రీలో ఎవరు చేయలేదేమో. ఈ రకంగా భర్త చైతూను… భార్య ఇంటర్వ్యూ చేయడం అనేది ఓ రేర్ రికార్డు అనే చెప్పుకుంటున్నారు అక్కినేని అభిమానులు. నాగ చైతన్య కూడా తన భార్య హోస్ట్ చేస్తోన్న ప్రోగ్రామ్‌కు రావడాన్ని ఎంతో ఎగ్జైంటింగ్‌గా ఫీలవుతున్నాడు. ఈ ఇంటర్వ్యూ కోసం అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సమంత కూడా ‘సామ్ జామ్’లో తొలిసారి తన భర్తను ఎలా ఇంటర్వ్యూ చేసిందో అని అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తోందట.