ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను తిప్పికొట్టండి : మంత్రి ఎర్రబెల్లి

18
dayakarrao

ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం లో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, రైతు బంధు సమితి అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీలు బండా ప్రకాష్, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బస్వరాజు సారయ్య తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఎర్రబెల్లి అబద్దాలు చెప్పడంలో ప్రతిపక్షాలు ఆరితేరాయని తెలిపారు. ఎప్పుడు మనకు కనపడని వాళ్ళు ఈ రోజు వస్తున్నారంటే ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. దేశంలో ఎక్కడ లేని పథకాలు మన రాష్ట్రంలో అమలు చేస్తున్నాం అన్నారు. గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి అనేక నిధులు తీసుకువచ్చాం అన్నారు.

కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రజల్లో ఉండి మనం సహాయం చేశాం…వారు ఆ సమయంలో అసలు మనకు కనిపించారా…. ఒక్కసారి ఆలోచించండి…కరోనా బాధితులను నేను మంత్రి కేటీఆర్ ఇతర నేతలం కలిసి అధికారులు వద్ద న్నా కూడా ఎంజీఎం కొవిడ్ వార్డుకు వెళ్లి పరామర్శించాం అన్నారు.