బాలీవుడ్‌ బడా హీరోలపై కేసు నమోదు..!

258
Salman Khan
- Advertisement -

బాలీవుడ్‌ ప్రముఖులపై అమెరికాకు చెందిన వైబ్రంట్‌ మీడియా సంస్థ దావా వేసింది. సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సహా నటి కత్రినా కైఫ్, సోనాక్షి సిన్హా, రణ్‌వీర్ సింగ్, ప్రభుదేవా తదితరులపై అమెరికాలో కేసు నమోదైంది. డబ్బులు తీసుకుని కూడా ప్రదర్శన ఇచ్చేందుకు నిరాకరించారని ఆరోపిస్తూ భారతీయ అమెరికన్ ప్రమోటర్ కేసు దాఖలు చేశారు.

Katrina Kaif

ఇల్లినాయిస్‌లోని నార్తరన్ డిస్ట్రిక్ట్ కోర్టులో చికాగోకు చెందిన వైబ్రెంట్ మీడియా గ్రూప్ పేరుతో కేసు దాఖలైంది. పైన పేర్కొన్న నటులతోపాటు సూపర్ స్టార్ అక్షయ్ కుమార్‌తోపాటు గాయకులు ఉదిత్ నారాయణ్, అల్కా యాజ్ఞిక్, ఉషా మంగేష్కర్‌లపైనా కేసు దాఖలైంది. అలాగే, నటులతోపాటు వారి ఏజెంట్లు అయిన మ్యాట్రిక్స్ ఇండియా ఎంటర్‌టైన్‌మెంట్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, యశ్‌రాజ్ ఫిల్మ్స్ ప్రైవేటు లిమిటెడ్‌లపై మోసం కేసు దాఖలైంది. డబ్బు తీసుకొని కన్సర్ట్ లో పాల్గొనడానికి ఈ నటీనటులు నిరాకరించారని దావాలో పేర్కొంది.

వారు తీసుకున్న పారితోషికాన్ని తిరిగిచ్చేస్తామని చెప్పిన సెలబ్రెటీలు.. మాట నిలబెట్టుకోలేదని.. కాన్సర్ట్‌కి కూడా రాలేదని వైబ్రంట్‌ మీడియా పిటిషన్‌లో పేర్కొంది. ముందు తమతో ఒప్పందం కుదుర్చుకుని ఆ తర్వాత తమకు చెప్పకుండా వేరొకరి వద్ద డబ్బు తీసుకుని ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. ‘వారంతా కలిసి మిలియన్ల డాలర్లు తీసుకున్నారు. ఆ తర్వాత డబ్బు తిరిగిచ్చేస్తామని చెప్పారు. కానీ ఇవ్వలేదు. వారికి ఎన్నిసార్లు ఫోన్లు చేసినా స్పందించలేదు.

Katrina Kaif

వారి వల్ల మాకు మిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లింది. అందుకే దావా వేశాం. సల్మాన్‌ ఒక్కడికే అడ్వాన్స్‌గా 2 లక్షల డాలర్లు పారితోషికం ఇచ్చాం. కత్రినాకు 40వేల డాలర్లు, సోనాక్షికి 36వేల డాలర్లు ఇచ్చాం. ఏ ఒక్కరూ మా డబ్బు తిరిగివ్వలేదు. ప్రస్తుతం దీనిపై ఇల్లినాయిస్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టు విచారణ జరుపుతోంది’ అని వైబ్రంట్‌ సంస్థ పేర్కొంది.

- Advertisement -