‘లవర్‌’పై ఆశలు పెట్టుకున్న రాజ్ తరుణ్..

236
- Advertisement -

టాలీవుడ్‌ హీరో రాజ్ తరుణ్ ఉయ్యాల జంపాల సినిమాతో ఎంట్రీ ఇచ్చి సినిమా చూపిస్త మావ.. కుమారి 21 ఎఫ్ లాంటి వరుస విజయాలతో అలరించాడు. కానీ విజయాలు సాధించడం కంటే వాటిని నిలబెట్టుకోవడం కష్టమని రాజ్ తరుణ్ విషయంలో రుజువైంది. మొదట్లో అన్నీ కలిసొచ్చి వరుస విజయాలందుకున్న రాజ్.. తర్వాత వరుసబెట్టి ఫ్లాపులిచ్చాడు. ఈ ఏడాదైతే.. ‘రంగులరాట్నం’.. ‘రాజుగాడు’ దారుణమైన ఫలితాన్నందుకున్నాయి. దీంతో రాజ్ ఫాలోయింగ్.. మార్కెట్ మొత్తం దెబ్బ తినేసింది. ఇప్పుడు అత్యవసరంగా ఓ హిట్టు కోసం ఎదురు చూస్తున్నాడతను.

Raj Tarun

తాజాగా రాజ్ తరుణ్ నటించిన ‘లవర్’ మూవీ ప్రేక్షకుల ముందుకు రావడానికి ముస్తాబవుతోంది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి అనీష్ కృష్ణ దర్శకత్వం వహించాడు. యూత్ కి నచ్చే ప్రేమకథాంశంతో నిర్మితమైన ఈ సినిమా ద్వారా తెలుగు తెరకి ‘రిద్ధి కుమార్’ కథానాయికగా పరిచయమవుతోంది. తాజాగా టైటిల్ లోగోతో కూడిన పోస్టర్ ను రిలీజ్ చేశారు.

Raj Tarun

ఈ పోస్టర్‌లో ఒక అబ్బాయి చేయి .. అమ్మాయి చేయిని పట్టుకోని కనిపిస్తుంది. హాస్పిటల్ నేపథ్యంలో హీరో హీరోయిన్లకి సంబంధించిన ఈ స్టిల్ ఆసక్తిని రేకెత్తించేదిలానే వుంది. ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను రేపు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నట్టు ఈ పోస్టర్ ద్వారా తెలియజేశారు. వరుస పరాజయాలతో డీలాపడిన రాజ్ తరుణ్ ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.

- Advertisement -