మంత్రి కేటీఆర్‌కు మరో అంతర్జాతీయ అహ్వానం..

266
KTR
- Advertisement -

పురపాలక శాఖ మంత్రి కెటి రామారావుకు మరో అంతర్జాతీయ అహ్వానం లభించింది. జర్మనీ దేశంలో అధ్యాయనానికి రావాల్సిందిగా ఇండో జర్మన్ కోపరేషన్ అన్ సీడ్ సెక్టార్ డెవలప్ మెంట్ అహ్వానం పంపింది. జర్మనీలో విత్తణ ఉత్పత్తి అభివృద్ది ఇంప్లీమెంట్ ఏజెన్సీ అయిన ఏడిటి ప్రాజెక్ట్ ఈమేరకు మంత్రికి ప్రత్యేకంగా ఒక లేఖను రాసింది. గతంతో ఒకసారి జర్మనీలో పర్యటించాల్సింగా కోరినప్పటికీ మంత్రికి బీజీ షెడ్యూళ్ల వలన రాలేక పోయారని, జర్మనీకి రావాలని మరోసారి కోరింది.

KTR

ఈ నెల ( జూన్) 25 నుంచి 27 వరకు జర్మనీలో పర్యటించి విత్తన రంగంపైన అధ్యాయనం చేయాలని కోరింది. ఈ మేరకు అక్కడి వివిధ కంపెనీలతోపాటు విత్తనోత్పత్తి కేంద్రాల్లో పర్యటించేందుకు అన్ని ఏర్పాటు చేస్తామని మంత్రికి తెలిపారు. ఈ అద్యాయనం తెలంగాణలో విత్తణ పార్కు ఏర్పాటుకు సహాకరిస్తుందని తెలిపింది. జూన్ నాల్గవ వారంలో జర్మనీలో పర్యటించి ఈ నెల 26న బెర్లీన్‌లో జరిగే వరల్డ్ పుడ్ కన్వేన్షన్‌కు హాజరు కావాలని కోరింది.

- Advertisement -