వైరల్ జ్వరాలపై ప్రత్యేక డ్రైవ్..

73
harish

సిద్దిపేట జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన హరీష్‌… వైరల్ జ్వరాలు వ్యాప్తి చెందకుండా అన్ని మున్సిపాలిటీల‌లో పూర్తి స్థాయి ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలి అని ఆదేశించారు.

అదనపు కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఫోకస్డ్ గా డ్రైవ్ చేపట్టాలి అని మంత్రి హ‌రీశ్‌రావు సూచించారు. వైరల్ వ్యాధుల వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఇంటి పరిసరాలు, సామూహిక ప్రదేశాలలో మురుగు, వర్షపు నీటి నిల్వలు లేకుండా చూడాలన్నారు

మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, క‌మిష‌న‌ర్లు, అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది ప్రత్యేక డ్రైవ్‌లో తప్పనిసరిగా భాగస్వామ్యం కావాలి అని ఆదేశించారు. ప్రత్యేక డ్రైవ్‌లో ప్ర‌తి ఒక్క‌రూ భాగ‌స్వామ్యులై వైర‌ల్ జ్వ‌రాల బారిన‌ప‌డ‌కుండా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాలని సూచించారు.