ప్రభాస్ ‘సలార్’ అప్‌డేట్‌..

46

రెబల్‌ స్టార్‌ ప్రభాస్ ప్రస్తుతం ‘సలార్’ సినిమాలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా ఇది నిర్మితమవుతున్న ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో ప్రభాస్ సరసన నాయికగా శ్రుతి హాసన్ నటిస్తుంది. కాగా,ఈ మూవీలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయనున్నాడని తెలుస్తోంది. తండ్రీకొడుకులుగా ప్రభాస్ కనిపించనున్నాడని అంటున్నారు. ఈ రెండు విభిన్నమైన లుక్స్ లో ప్రభాస్‌ను చూడటానికి వాళ్లంతా ఆత్రుత పడుతున్నారు. తాజాగా ఈ చిత్రం నుండి మరో ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ వినిపిస్తోంది.

ఈచిత్రంలో ప్రభాస్ తండ్రి పాత్రకి సంబంధించిన ఎపిసోడ్ ఫ్లాష్ బ్యాక్‌లో వస్తుందట. ఈ ఎపిసోడ్ లో ఆయన ఆర్మీ ఆఫీసర్‌గా కనిపిస్తాడని టాక్‌. ఈ పాత్రను ప్రశాంత్ నీల్ డిజైన్ చేసిన తీరు ఎంతో ప్రత్యేకంగా ఉంటుందని సమాచారం.. ఈ ఎపిసోడ్ లో వచ్చే ‘వార్’ సీన్ ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. ప్రభాస్ అభిమానులు విజిల్స్ వేసేలా ఈ ఎపిసోడ్ సాగుతుందని చెబుతున్నారు.