బ్లాక్ ఫంగ‌స్ చికిత్స‌కు ప్ర‌భుత్వం పటిష్టమైన చర్యలు..

210
Black Fungus
- Advertisement -

బ్లాక్ ఫంగ‌స్ కేసుల చికిత్స‌కు తెలంగాణ ప్ర‌భుత్వం నోడల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు కోఠిలోని ఈఎన్‌టీ ఆస్ప‌త్రిని నోడ‌ల్ కేంద్రంగా వైద్యశాఖ అధికారులు ప్ర‌క‌టించారు. కొవిడ్ నుంచి కోలుకున్న వారిలో కొంద‌రికే బ్లాక్ ఫంగ‌స్ స‌మ‌స్య ఉంద‌ని డీఎంఈ తెలిపారు. బ్లాక్ ఫంగ‌స్ బారిన ప‌డుతున్న వారిలో ఈఎన్‌టీ స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. బ్లాక్ ఫంగ‌స్ నిర్ధ‌ర‌ణ అయిన బాధితుల‌కు గాంధీ ఆస్ప‌త్రిలో చికిత్స అందిస్తామ‌న్నారు. ఆప్త‌మాల‌జీ వైద్యుడి అవ‌స‌రం ఉంటే స‌రోజిని దేవీ ఆస్ప‌త్రిలో చికిత్స అందించ‌నున్నారు. బ్లాక్ ఫంగ‌స్‌కు వాడే ఔష‌ధాల‌ను స‌మ‌కూర్చాల‌ని టీఎస్ఎంఐడీసీకి ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు గాంధీ, సరోజిని దేవి, కోటి ఈఎన్‌టీ ఆస్పత్రుల సుపరిండెంట్‌లు తగిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

కోవిడ్ బారిన పడిన కొందరిలో బ్లాక్ ఫంగస్ సమస్యను గుర్తించారు. కోవిడ్ రోగులకు చికిత్స అందించే సమయంలో షుగర్ లెవల్‌ను సరిగా అదుపు చేయాలని పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో బ్లాక్ ఫంగస్ రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రైవేట్ ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేశారు. షుగర్ లెవల్‌ను కంట్రోల్ చేసేందుకే అవసరం అయితే స్టిరాయిడ్ లను వాడాలి. అవసరం అయితే యాంటి ఫంగల్, యాంటీ బయోటిక్ మందులు వాడాలని ప్రభుత్వం ఆదేశించింది.

- Advertisement -