పీఆర్సీపై సజ్జల స్పందన..

18

ఏపీ ప్రభుత్వం ఈరోజు పీఆర్సీపై ప్రకటన చేయనుంది. ఉద్యోగ సంఘాలను సీఎం జగన్‌తో భేటీకి తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి పిలిపించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. పీఆర్సీ అంశం ఈరోజుతో ముగుస్తుందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులను సీఎం నిన్న ఉద్యోగ సంఘాలకు వివరించారని పేర్కొన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన ప్రకటన వస్తుందని, అన్ని వర్గాలను కలుపుకుని పోయేలా నిర్ణయం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇంటి పెద్దలా సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని సజ్జల తెలిపారు.