లబ్ధిదారులకు CMRF చెక్కులు అందించిన మంత్రి..

19

శుక్రవారం ధర్మపురి నియోజకవర్గ కార్యకర్తలకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కులను అందించారు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఇస్రాజ్ పల్లి గ్రామానికి చెందిన కందుకూరి శ్రీనివాస్‌కు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు అయిన 1 లక్ష రూపాయల చెక్కు, పెగడపెల్లి మండలం నామాపూర్ గ్రామానికి చెందిన సిహెచ్. రమకు 60 వేల రూపాయల చెక్కును అందించారు.

అలాగే ధర్మపురి పట్టణానికి చెందిన స్తంబంకాడి సత్తయ్య అనారోగ్యంతో మరణించగా వారి ఆసుపత్రి బిల్లులను ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా సహాయ నిధి ద్వారా మంజూరైన 85 వేల రూపాయల చెక్కును కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో సత్తయ్య కుమారుడు శ్రీనివాస్‌కు అందించడం జరిగింది. వెల్గటూర్ మండలం కొత్తపేట గ్రామానికి చెందిన దాసరిసత్తెమ్మకు 50 వేల రూపాయల చెక్కును కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు మంత్రి కొప్పుల ఈశ్వర్ అందించారు.