నిలకడగా సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం..

19

మెగా హీరో చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు అపోలో ఆస్పత్రి వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈరోజు సాయితేజ్‌ కాలర్‌బోన్‌కు శస్త్రచికిత్స చేసే విషయంలో అపోలో వైద్యులు నిర్ణయం తీసుకోనున్నారు. సాయితేజ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. చికిత్సకు స్పందిస్తున్నారు. ప్రమాదంలో శరీరం లోపల ఎలాంటి రక్తస్రావం కాలేదని వైద్యులు ఇప్పటికే నిర్ధారించారు. ఈ నేపథ్యంలో వైద్య పరీక్షల ఫలితాలను పూర్తిస్థాయిలో పరిశీలించిన అనంతరం కాల్‌బోన్ శస్త్రచికిత్సపై నిర్ణయం తీసుకుంటామని వైద్యులు తెలిపారు.