బిగ్ బాస్ షాక్‌.. ఈవారం సరయు ఎలిమినేషన్..!

67
Sarayu

బుల్లితెరపై బిగ్ బాస్ 5 సందడి మొదలయ్యింది. ఈ సీజన్ లో మొత్తం 19 మంది కంటెస్టెంట్ లు పాల్గొన్నారు. చాలా వరకు అందరూ పరిచయమున్న సెలబ్రిటీలే కాగా.. ఇక మరికొందరి గురించి తెగ సర్చ్ లు చేస్తున్నారు ప్రేక్షకులు. ఇదిలా ఉంటే మొదటి ఎలిమినేషన్‌లో ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ పేరు ప్రస్తుతం వైరల్‌గా మారింది. తాజాగా ఈవారం ఎలిమినేషన్‌లో షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే.. యూట్యూబ్ సంచలనం సరయు ఎలిమినేషన్. అదేంటి ఆమె ఎలిమేట్ కావడం ఏంటి అంటే.. జెస్సీ ఎలిమినేట్ అవుతాడని అన్ని పోల్స్‌లోనూ స్పష్ఠమైన అభిప్రాయాలను తెలియజేశారు ప్రేక్షకులు. అయితే జెస్సీ కాకుండా తొలివారంలో సరయు ఎలిమినేట్ అవుతుందనే లీక్‌లు బయటకు వచ్చాయి. ప్రస్తుతం నామినేషన్స్‌లో ఆరుగురిలో యాంకర్ రవి, హమీదాలు శనివారం నాటి ఎపిసోడ్‌లో సేవ్ అయ్యారు. ఇక మిగిలింది మానస్, సరయు, కాజల్, జెస్సీలు.. అయితే ఈ నలుగురిలో మొదట మానస్, కాజల్‌ని సేవ్ చేసి.. ఆ తరువాత జెస్సీ, సరయులను టెన్షన్ పెట్టి.. సరయుని ఎలిమినేట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

లెక్క ప్రకారం చూస్తే ఏ పోల్ చూసినా జెస్సీ ఎలిమినేషన్ అనే వస్తోంది. అయితే అతనికి బదులుగా సరయుని ఎలిమినేట్ చేసి బిగ్ బాస్ గట్టి షాకే ఇస్తున్నారట. గత వారం రోజులుగా చూస్తే.. సరయుకి స్క్రీన్ స్పేస్ అస్సలు ఇవ్వకపోవడం.. చూపించిన ప్రతిసారి ఆమెను నెగిటివ్ గానే చూపించడం లాంటివి చేశారు బిగ్ బాస్.ఇక జెస్సీని జైలుకి పంపేట్టు చేసి అతనికి ఫుల్ స్క్రీన్ స్పేస్ ఇచ్చారు.. పదే పదే అతన్ని చూపిస్తూ బాగానే ప్రమోట్ చేయడం ద్వారా జెస్సీ సింపథీ ఓట్లు పెరిగిట్టుగానే ఉన్నాయి. మొత్తంగా సరయు ఎలిమినేట్ అయితే కనుక ఇది బిగ్ బాస్ వ్యూహాత్మక నిర్ణయం అనే చెప్పాలి. సరయు అంటే బూతులకు కేరాఫ్ అడ్రస్.. శనివారం నాటి ఎపిసోడ్‌లో నాగార్జున ఆమెను అడిగిమరీ బూతులు తిట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఆమె అసలు ఆట మొదలుపెడుతుందనే టైం ఎలిమినేట్ చేయడం షాకింగ్ అనే చెప్పాలి.మరి డేంజర్‌జోన్‌లో ఉన్న సరయు ఎలిమినేట్‌ అవుతుందా..లేదా.. తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్‌ చూడాల్సిందే.