గోపీచంద్ ‘సీటీమార్‌’పై ప్రభాస్ కామెంట్స్‌..

25
Prabhas

సంపత్ నంది దర్శకత్వంలో మాచో హీరో గోపీచంద్ – మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా రూపొందిన సినిమా ‘సీటీమార్’. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని విజయవంతగా ప్రదర్శింపబడుతోంది. అయితే తాజాగా ఈ చితాన్ని రెబల్‌ స్టార్‌ ప్రభాస్ చూడటం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభాస్ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

ఈ మేరకు ఆయన..”నా ఫ్రెండ్ గోపీచంద్ సీటీమార్ మూవీ బ్లాక్‌బస్టర్ కొట్టాడు..హ్యాపీ. కరోనా సెకండ్ వేవ్ తర్వాత వచ్చిన ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్ సీటీమార్. ఇలాగే సక్సెస్‌ఫుల్‌గా రన్ అవ్వాలని కోరుకుంటూ చిత్రబృందానికి అభినందనలు” అని ఇస్టా పోస్ట్‌లో పేర్కొన్నారు.. కాగా చాలా కాలం తర్వాత గోపీచంద్ – దర్శకుడు సంపత్ నంది భారీ విజయాన్ని అందుకున్నారు.