పెట్‌డాగ్‌పై పన్నులు ఎక్కడో తెలుసా…

73
- Advertisement -

ఎగువ మధ్య స్థాయి ఆదాయం కలిగిన కుటుంబాలు కుక్కను కలిగి ఉండటం ఇప్పడు సర్వసాధారణంగా మారింది. అయితే దీనికి విరుద్ధంగా మధ్యప్రదేశ్‌లోని సాగర్ మున్సిపాలిటీలో కుక్కలను పెంచకూడదని ఆదేశాలు జారీ చేయనున్నారు. ఈమేరకు కుక్కలను పెంచుకొవాలంటే ఖచ్చితంగా పన్నులు కట్టాల్సిందేనని తీర్మానించింది. ఈ తీర్మానాన్ని 48మంది కౌన్సిలర్లు కూడా ఏకగ్రీవంగా ఆమోదించారు. అయితే దీనిపై త్వరలో న్యాయనిపుణులతో చర్చిస్తామని, విధి విధానాలను త్వరలో రూపొందిస్తామని పేర్కొంది.

ప్రజల భద్రత పరిశుభ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అంతేగాక నగరంలో కుక్కల దాడి ఘటనలు విపరీతంగా పెరిగాయని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో కుక్కలను తీసుకువచ్చి మలమూత్ర విసర్జన చేయించడం వల్ల ప్రజలు తీవ్రంగా ఆనారోగ్య బారిన పడుతున్నారని పేర్కొన్నారు. వీటిని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

ఇవి కూడా చదవండి…

ఈ నెల 15న దావోస్‌కు కేటీఆర్‌…

సంక్రాంతి వచ్చింది…పల్లె రమ్మంది

జోడో యాత్రలో విషాదం…

 

- Advertisement -