వనరపర్తిలో ఆర్టీపీసీఆర్ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. రూ.కోటి 16 లక్షలతో ఆర్టీపీసీఆర్ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని….ప్రజలకు అందుబాటులో 150 ఆక్సిజన్ బెడ్లు, 2 వెంటిలేటర్లు ఉన్నాయన్నారు.
కరోనా నేపథ్యంలో వనపర్తిలో అందిస్తున్న, అందించాల్సిన సేవలు, వసతులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నిరంజన్ రెడ్డి…
గాంధీనగర్ పాఠశాలలో సెంటర్ ఏర్పాటు చేశామని ప్రజలు వినియోగించుకోవాలన్నారు.టీఆర్ఎస్ నేత మామిడిమాడ రంగారెడ్డి కుమారుడి సహాయంతో త్వరలో మరో వెంటిలేటర్ ఏర్పాటు చేస్తామన్నారు.
98 శాతం మంది కరోనా నుండి బయటపడుతున్నారని……సెకండ్ వేవ్ లో 53046 మందికి పరీక్షలు నిర్వహించగా 6384 మందికి కరోనా నిర్దారణ అయిందన్నారు. ఈ రెండు నెలలకు అవసరమైన వైద్యులను వెంటనే తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకుని వారు విధులలో చేరేలా చూసుకోవాలన్నారు.