27 ఏళ్ల వివాహబంధానికి బ్రేకప్‌!

54
bill gates

మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ తన 27 ఏళ్ల వివాహ బంధాన్ని తెంచుకోబుతున్నారు. భార్య మెలిందా నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు. ఎన్నో సమాలోచనల అనంతరం మా వివాహ బంధాన్ని తెంచుకోవాలని నిర్ణయానికి వచ్చాం…అయితే మా ఫౌండేషన్‌లో ఇద్దరి భాగస్వామ్యం కొనసాగుతుందని తెలిపారు.

కొత్త ప్రపంచంలోకి వెళ్లేందుకు వీలుగా, మా వ్యక్తిగత ఆకాంక్షలను, మా విడాకుల నిర్ణయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నాం అని ప్రకటించారు. ప్రస్తుతం బిల్‌గేట్స్‌ వయసు 65 ఏళ్లు కాగా, మెలిందా వయసు 56 ఏళ్లు.

మైక్రోసాఫ్ట్‌ను స్థాపించి బిల్‌గేట్స్‌ సీఈవోగా ఉన్న సమయంలో 1987లో మెలిందా ప్రొడక్ట్‌ మేనేజర్‌గా చేరారు. ఇద్దరూ తొలిసారిగా న్యూయర్క్‌ నగరంలో జరిగిన విందు కార్యక్రమంలో కలుసుకోగా.. ఆ తర్వాత 1 జనవరి, 1994లో హవాయిలో వీరిద్దరి పెళ్లి జరిగింది. 2000 సంవత్సరంలో స్థాపించిన బిల్‌-మెలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ను స్థాపించి…. ఇప్పటివరకూ 54.8 బిలియన్‌ డాలర్లను ధార్మిక కార్యక్రమాలకు ఖర్చు చేశారు.