బీఎస్పీలోకి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్..!

120
rs praveen

మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమైందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆయన వీఆర్ఎస్ తీసుకున్న దగ్గరి నుండి పొలిటికల్ ఎంట్రీపై రకరకాల ఊహాగానాలు వస్తుండగా వాటికి బలం చేకూరేలా బీఎస్పీ చీఫ్ మాయావతి కీలక ప్రకటన చేశారు.

మీడియాతో మాట్లాడిన మాయావతి.. కాన్షీరాం అడుగుజాడల్లో నడిచేందుకు తెలంగాణకు చెందిన మాజీ సీనియర్ ఐపీఎస్‌ ఆఫీసర్‌.. బీఎస్పీలో చేరేందుకు సిద్ధం అవుతున్నారని.. త్వరలోనే ఆయన పార్టీలో చేరతారని ప్రకటించారు.

గత నెలలో యూపీకి వెళ్లిన ప్రవీణ్ కుమార్.. బీఎస్సీ అధినేత్రి మాయావతితో భేటీ అయ్యారు. అప్పటినుండే ఆయన బీఎస్పీలో చేరుతారనే వార్తలు వస్తుండగా స్వచ్చంధ పదవీ విరమణ చేసిన అనంతరం పలు ఇంటర్వ్యూలో సైతం తెలంగాణలో కొత్త శక్తి రావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. తాజాగా మాయావతి ప్రకటనతో ప్రవీణ్ కుమార్ చేరిక లాంఛనమే కానుంది.