అంటే సుందరంకోసం నాని ఏంచేశాడో తెలుసా..?

38
nani

వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమయ్యాడు హీరో నాని. ఓ వైపు కరోనా విజృంభన కొనసాగుతున్న నాని మాత్రం తన సినిమాల జోరును ఏమాత్రం తగ్గించడం లేదు. ఇప్పటికే నాని నటించిన టక్ జగదీష్ విడుదలకు సిద్ధంగా ఉండగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో ‘శ్యామ్ సింగ రాయ్’ అనే సినిమా కూడా కంప్లీట్ చేశారు.

నాని సరసన సాయి పల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్స్‌గా రూపొందుతున్న ఈ సినిమా కోల్ కత్తా నేపథ్యంలో కథ సాగుతుంది.ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న నాని ఏ మాత్ర గ్యాప్ లేకుండా ‘అంటే సుందరానికి’ చిత్ర షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు నాని. ‘శ్యామ్ సింగ రాయ్’ నుంచి ‘అంటే సుందరానికి’ మేకోవర్‌లోకి సింపుల్‌గా మారిపోయినట్టు మీసాలు తీసేసిన వీడియోని పోస్ట్ చేసాడు. ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.