చిరు 153ని మొదలుపెట్టిన తమన్..!

117
thaman
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకోగా తాజాగా 153 సినిమాని అనౌన్స్‌చేశారు చిరు. మళయాళంలో సూపర్ హిట్టైన ‘లూసిఫర్’ సినిమా రీమేక్‌లో చిరు నటించనుండగా, ఈ సినిమా రెగ్యులర్ షెడ్యూల్ ఆగస్టు 12 నుంచి మొదలు కాబోతుంది.

ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించగా తమన్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి రీమేక్‌కి రికార్డింగ్ పనులు స్టార్ట్ చేసినట్టు తమన్ ట్విట్టర్ ద్వారా తెలియచేశాడు. నా జీవితంలో ఇది అద్భుతమైన రోజు, నా కల నెరవేరబోతోంది…అని, మెగాస్టార్‌ చిరంజీవి గారి సినిమాకు ఫస్ట్ సాంగ్‌ను రికార్డు చేయబోతున్నట్టు, దీనికోసం లండన్‌లోని అబ్బేరోడ్ స్టూడియోలో పని చేస్తున్నట్టు ట్వీట్‌లో పేర్కొన్నారు తమన్.

- Advertisement -