సెన్షనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన చేశాడు. తాను అతి త్వరలో మరో సినిమా తీయబోతున్నట్లు ప్రకటించాడు. వ్యూహం అనే రాజకీయ సినిమా తీస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపాడు. అయితే ఇది బయోపిక్ కాదు.. బయో పిక్ కన్నా లోతైన రియల్ పిక్. బయో పిక్ లో అయినా అబద్దాలు ఉండొచ్చు కానీ రియల్ పిక్ లో నూటికి నూరు పాళ్ళు నిజాలే ఉంటాయి అని అన్నాడు. అహంకారానికి , ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుండి ఉద్భవించిన “వ్యూహం” కధ , రాజకీయ కుట్రల విషం తో నిండి వుంటుంది . రాచకురుపు పైన వేసిన కారం తో బొబ్బలెక్కిన ఆగ్రహానికి ప్రతికాష్టే “వ్యూహం” చిత్రమని చెప్పుకొచ్చాడు.
వ్యూహం సినిమా 2 పార్ట్స్ గా రాబోతుందని ప్రకటించాడు. మొదటి పార్ట్ “వ్యూహం” , రెండవ పార్ట్ “శపథం” అని తెలిపాడు. రెండింటిలోనూ రాజకీయ ఆరాచకీయాలు పుష్కలంగా వుంటాయని అన్నాడు. రాష్ట్ర ప్రజలు మొదటి చిత్రం “వ్యూహం “ షాక్ నుంచి తెరుకునే లోపే వాళ్ళకి ఇంకో ఎలెక్ట్రిక్ షాక్ , పార్ట్ 2 “శపథం “ లో తగులుతుందన్నాడు.
బుధవారం రామ్ గోపాల్ వర్మ ఏపీ సీఎం జగన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ప్రకటించిన వ్యూహం సినిమాపై ఆసక్తి నెలకొంది.పవన్ ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్న వైసీపీ నేతలు పెద్ద ప్రణాళికలే రచిస్తున్నారట. పవన్ కళ్యాణ్ వివాహాలపై ఏకంగా సినిమాలు చేసేందుకు పావులు కదుపుతున్నారట. దీనిలో భాగంగానే రామ్ గోపాల్ వర్మ సీఎం జగన్ ని కలిశారనేది హాట్ న్యూస్.
ఇవి కూడా చదవండి