జస్ట్ ఆస్కింగ్‌…విస్కీతో టీచర్స్ డే!

552
rgv
- Advertisement -

వివాదాస్పద దర్శకుడు మరో సంచలన వ్యాఖ్య చేసి వార్తల్లో నిలిచారు. జస్ట్ ఆస్కింగ్ అంటూ టీచర్స్‌ డేని టీచర్‌ విస్కీతో సెలబ్రేట్ చేసుకుంటారా అంటూ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.

నా టీచర్స్ అంతా నన్నో మంచి విద్యార్థిగా, మంచి వ్యక్తిత్వమున్న మనిషిగా మార్చడంలో ఫెయిల్ అయ్యారు. కాబట్టి టీచర్స్ డే గురించి ఏం చెప్పాలో నాకు తెలియదని తనదైన శైలీలో ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.

నేను ఒకవేళ బ్యాడ్ స్టూడెంట్ అయినప్పటికీ.. నన్ను గుడ్ స్టూడెంట్‌గా మార్చడం మంచి టీచర్ విధి కాదా? ఎప్పుడైతే నన్ను మంచి విద్యార్థిగా మార్చడంలో వారు ఫెయిల్ అయ్యారో అప్పుడే వారు బ్యాడ్ టీచర్స్‌గా నిరూపించబడ్డారంటూ పేర్కొన్నారు. దీనిపై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

- Advertisement -