పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా రేవంత్ రెడ్డి!

38
revanth

తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపిక తుది దశకు చేరుకుంది. అందరి నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకున్న అధిష్టానం ఎవరు ఉహించని విధంగా నిజామాబాద్ జిల్లాకు చెందిన జీవన్ రెడ్డి పేరును ఖరారు చేసినట్లు సన్నిహితవర్గాల సమాచారం. జీవన్ రెడ్డికి పీసీసీ అధ్యక్షపదవి ఇస్తే ఆయన చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరిని కలుపుకొని పోతారని భావించిన కాంగ్రెస్ అధిష్ఠానం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇకపై తొలి నుండి పీసీసీ రేసులో ఉన్న రేవంత్ రెడ్డికి పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ బాధ్యతలు అప్పజెప్పనున్నట్లు సమాచారం. దీంతో రేవంత్ అనుచరులు నిరాశగా ఉన్న రేవంత్ రెడ్డి మాత్రం తనకు ఏ పదవి అప్పజెప్పిన స్వీకరించి వందశాతం న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు.

ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి…తన స్వభావానికి పీసీసీ ప్రచార కమిటీ సరిపోతుందన్నారు. రాష్ట్రమంతా ప్రచారం చేస్తానని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీకి అంత సీన్ లేదని తెలిపిన రేవంత్…4 ఎంపీలు గెలిచిన బీజేపీ స్ధానిక సంస్థల ఎన్నికల్లో కనీసం ఒక ఎంపీపీ స్ధానాన్ని కూడా గెలుచుకోలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.