పీసీసీ చీఫ్‌గా జీవన్‌ రెడ్డి..!

33
jeevan

తెలంగాణ పీసీసీ చీఫ్ ఎవరనేది త్వరలో తేలిపోనుంది. ఇప్పటికే జిల్లాల వారీగా పార్టీ నేతల అభిప్రాయాలను తీసుకున్న రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మాణికం ఠాగూర్ లీస్టును అధిష్టానానికి అందజేసింది. ప్రధానంగా పీసీసీ రేసులో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉండగా అనూహ్యంగా నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది.

రేవంత్‌ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇస్తే పార్టీని వీడుతామని సీనియర్లు తెలపడంతో పార్టీలో అందరికి ఆమోదయోగ్యంగా ఉండే నిర్ఱయన్ని తీసుకోవాలని భావించిన ఏఐసీసీ.. జీవన్ రెడ్డి పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. జీవన్ రెడ్డికి పీసీసీ అధ్యక్షపదవి ఇస్తే ఆయన చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరిని కలుపుకొని పోతారని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది.

ఇక పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా రేవంత్ రెడ్డి పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. ఆఖరి నిమిషంవరకు పీసీసీ రేసులో ఉన్న రేవంత్‌ కు ప్రచారకమిటీ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.జీవన్‌రెడ్డికి పార్టీ వ్యవహారాలు చక్కదిద్దే పనిలో ఉంటే, రేవంత్ రాష్ట్రమంతా తిరిగి పార్టీని బలోపేతం చేస్తారని అధిష్ఠానం భావిస్తోంది. దీనికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ త్వరలో వచ్చే అవకాశం ఉంది.