ఆర్థిక మాంద్యం..మరింత భారం తప్పదు!

96
reliance
- Advertisement -

ఆర్థిక మాంద్యం నేపథ్యంలో మున్ముందు మరింత భారాలను భరించాల్సి ఉంటుందని తెలిపింది రిలయన్స్ ఇండస్ట్రీస్. క‌నిష్ట ధ‌ర‌ల‌తోపాటు లాభాలు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో ఆయిల్ మార్కెట్ ఫండ‌మెంట‌ల్స్‌ను ఆర్థిక మాంద్యం భ‌యాలు అధిగ‌మిస్తాయ‌ని శుక్ర‌వారం తొలి త్రైమాసికం ఆర్థిక ఫ‌లితాల వెల్ల‌డి త‌ర్వాత‌ రిల‌య‌న్స్ జాయింట్ చీఫ్ ఫైనాన్సియ‌ల్ ఆఫీస‌ర్ వీ శ్రీ‌కాంత్ చెప్పారు.

అంత‌ర్జాతీయంగా ఆర్థిక మాంద్యం ముప్పు పొంచి ఉంద‌ని అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఇన్‌పుట్ ధ‌ర‌లు, ర‌వాణా చార్జీలు పెరిగిపోవ‌డంతో నిర్వ‌హ‌ణ ఖ‌ర్చులు అధికం కావ‌డం ప‌ట్ల శ్రీ‌కాంత్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇదిలా ఉంటే, ఈ నెలాఖ‌రులోగా ప్ర‌పంచ ఆర్థిక వృద్ధిరేటు ఔట్‌లుక్‌ను త‌గ్గించ‌నున్న‌ట్లు అంత‌ర్జాతీయ ద్ర‌వ్య‌నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) ప్ర‌క‌టించింది.

- Advertisement -