ఫిబ్రవరి 4న..75వ వసంతంలోకి లంక

18
- Advertisement -

గత కొంత కాలంగా ఆర్థిక సంక్షోభం వల్ల దేశ ప్రజలు తిరుగుబాటు చేసిన కొద్ది నెలల తర్వాత జరగబోయే 75వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించాలని శ్రీలంక ప్రభుత్వ అధ్యక్షుడి మీడియా విభాగం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్బంగా 75 వసంతాలు పూర్తి చేసుకొన్న సందర్భంగా ప్రముఖుల  స్మారక స్టాంపులను విడుదల చేయాలని నిర్ణయించింది. ఇందులో భారత మొదటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ  పోస్టల్ స్టాంప్‌ ఉంటుందని ప్రకటించింది.

2023లో ఫిబ్రవరి 4న 75వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకొనుంది. శ్రీలంక ప్రభుత్వం రాబోయే 25యేళ్లకు గాను నమో నమో మాతా-శతాబ్ధానికి ఒక అడుగు దూరం అనే థీమ్‌తో ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. రాబోయే 25 సంవత్సరాలలో ప్రభుత్వం ఒక కొత్త సంస్కరణవాద కోర్సు వైపు పయనిస్తుందని తెలిపారు. 2048లో జరిగే 100వ స్వాతంత్య్ర వేడుకులకు స్థిరమైన ప్రభుత్వ విధానాలను అమలు చేయాలని భావిస్తున్నట్టు పేర్కొన్నారు.

ఫిబ్రవరి 4న జరిగే వేడుకలు ఉదయం నుంచి గాల్‌ ఫేస్ గ్రీన్‌లో ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ వేడుకల్లో శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే ప్రధానమంత్రి దినేష్ గుణవర్ధనా పాల్గొని దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నట్టు పేర్కొన్నారు. ఈసందర్భంగా బౌద్ధ హిందూ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్టు మీడియా విభాగం పేర్కొంది.

ఇవి కూడా చదవండి…

మోదీపై ప్రశంసల జల్లు..ఎక్కడంటే?

ఖమ్మం నుంచే శంఖారావం…హరీశ్‌

తెలంగాణ అభివృద్ధికి కలిసిరండి..

- Advertisement -