శ్రీలంక ఆకలి ‘ కన్నీళ్లు ‘!

71
- Advertisement -

ఈ ఏడాది ఎన్నో ఊహించని సంఘటనలు చోటు చొసుకున్నాయి. వాటిలో శ్రీలంక పెను ఆర్థిక సంక్షోభం కూడా ఒకటి. ఎంతో సుందరమైన, ఆకర్షణీయమైన ద్వీపంగా టూరిస్టులను అమితంగా ఆకర్షించే శ్రీలంకను ఈ ఏడాది ( 2022 ) కనీ వినీ ఎరుగని ఆర్థిక సంక్షోభం ముంచెత్తింది. ఎంతలా అంటే ఆ దేశాన్ని పాలించే పాలకులే తమ వల్ల కాదంటూ పారిపోయారంటే.. శ్రీలంక పరిస్థితి ఎలా ఉండిందో అర్థం చేసుకోవచ్చు. 2.2 కోట్ల జనాభా కల్గిన శ్రీలంకను సంక్షోభాలు ముంచెత్తడం కొత్తేమీ కాదు. గతంలో కూడా శ్రీలంక చాలాసార్లు సంక్షోభం కోరల్లో చిక్కుకుంది. అయితే గడిచిన రెండేళ్లలో కరోనా కారణంగా శ్రీలంక ఆర్థిక వ్యవస్థపైన తీవ్ర స్థాయిలో ప్రభావం పడింది.

ఆ దేశ ప్రధాన ఆర్థిక వనరు టూరిజం.. అయితే కరోనా కారణంగా టూరిజంపై ఆంక్షలు విధించాల్సిరావడం, ఎక్కడికక్కడ రవాణా స్తంబించడంతో టూరిజం నుంచి వచ్చే ద్రవ్య నిల్వలు భారీగా తగ్గాయి. ఇక టూరిజం తరువాత ఆ దేశ యొక్క మరొక ఆర్థిక వనరు తేయాకు ఎగుమతి.. కరోనా కారణంగా ఎగుమతులు కూడా తగ్గిపోయాయి. ఫలితంగా విదేశీ మారక ద్రవ్య నిల్వలు 1.9 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అయితే శ్రీలంక పై అప్పుల భారం కూడా భారీగానే ఉంది.. స్థానిక విదేశీ మొత్తం రుణాలు కలిపి 8.6 బిలియన్ డాలర్లు చెల్లించాల్సిఉంది. కాగా ఓ వైపు ఆదాయం లేకపోవడం.. మరోవైపు తీసుకున్న అప్పుల భారం పెరిగిపోవడంతో శ్రీలంక పెను సంక్షోభం ఊబిలో పడిపోయింది.

అక్కడ ఒక గుడ్డు రూ,30 ( మన రూపాయల్లో ), లీటర్ పెట్రోల్ రూ. 230 ( మన రూపాయల్లో ).. ఇలా ప్రతి నిత్యవసర వస్తువు పైన ధరల మోత మోగింది. దీంతో అక్కడి పాలకులపై లంకేయుల ఆగ్రహ జ్వాలలు కట్టలు తెంచుకున్నాయి. మరోవైపు దేశాన్ని సాధారణ స్థితికి తీసుకురావడం కష్టమని భావించి పాలకులు సైతం పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా 2022లో శ్రీలంకలో ఏర్పడిన పెను ఆర్థిక సంక్షోభం.. ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేశాయి. ఏది ఏమైనప్పటికి శ్రీలంక దేశ చరిత్రలో 2022 మిగిల్చిన దుఖం లంకేయులు ఎప్పటికీ మర్చిపోలేరనే చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి…

బీజేపీది ట్రబుల్ ఇంజన్ సర్కార్..

తెలంగాణలో స్వర్ణ యుగం..

ఒకే రోజు పదిలక్షల కేసులు

- Advertisement -