ర‌వితేజ ‘ఖిలాడి’ ఫ‌స్ట్ గ్లింప్స్.. వీడియో

32
Khiladi Movie

టాలీవుడ్ హీరో మాస్‌ మహారాజ ర‌వితేజ ప్ర‌స్తుతం న‌టిస్తున్న చిత్రం ఖిలాడి. ఇది ర‌వితేజ న‌టిస్తోన్న‌ 67వ సినిమా. ఇందులో ఆయ‌న ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడు రవితేజ. ఈ సినిమా డా.జయంతిలాల్‌ గడ సమర్పణలో ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి ర‌వితేజ స‌ర‌స‌న న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి‌ దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు.

కాగా, ఈ రోజు ర‌వితేజ పుట్టిన‌రోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ఫ‌స్ట్ గ్లింప్స్ విడుద‌ల చేశారు చిత్ర బృందం. ఇందులో చేతిలో ఆయుధాన్ని ప‌ట్టుకుని ర‌వితేజ స్టైల్‌గా న‌డుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలను చూడవచ్చు. అద్భుత మ్యూజిక్ ఆయ‌న హావ‌భావాల‌కు త‌గ్గ‌ట్టుగా విన‌ప‌డుతోంది. మాస్ మ‌హారాజా అభిమానులను ఈ వీడియో ఎంతగానో అలరిస్తోంది. అయితే క్రాక్‌ హీట్‌ తర్వత రాబోతున్న చిత్రం కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి.

#Khiladi Movie First Glimpse | Raviteja, Meenakshi Chaudhary | Dimple Hayathi | Ramesh Varma | DSP