సీఎం కేసీఆర్‌తోనే తెలంగాణ అభివృద్ధి- ఎర్రబెల్లి

34
Minister errabelli

జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. గ్రామంలో సర్పంచ్ కొమురయ్య జెండా ఆవిష్కరణ చేయగా మంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గూడూరులో గ్రామస్తులు, మోక్ష ధర్మ హిందూ స్మశాన వాటిక ట్రస్ట్, వీధి భాగవతం కళాకారుల బృందం, స్థల, వాహన, ఫ్రీజర్ దాతల సహకారంతో పూర్తి చేసిన వైకుంఠ దామాన్ని, కొందరు దాతలు అందచేసిన పరమపద వాహనాన్ని, మంత్రి ప్రారంభించారు. ఆ తర్వాత అదే గ్రామంలోని పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి, అక్కడే మీడియాతో మాట్లాడారు.గాంధీజీ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ లాంటి, అనేకమంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగఫలం స్వాతంత్ర్యం అని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అవిరళకృషి, అనన్య సామాన్యమైన మేధా సంపత్తి ఫలితంగా మన రాజ్యాంగం ఏర్పడిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

రాజ్యాంగం స్పూర్తి, అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా సీఎం కేసీఆర్ ర్ ఎం ఓ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి అమలు చేస్తున్నారని మంత్రి అన్నారు. సీఎం కేసీఆర్ తోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. గ్రామాల అన్ని రంగాల అభివృద్ధి సీఎం కేసీఆర్ లక్ష్యం. గ్రామాల అభివృద్ధి కోసం ప్రతినెల 308 కోట్లు విడుదల చేస్తున్నాం. దీంతో గ్రామాల అభివృద్ధి కి నిధుల కొరత లేకుండా పోయిందని మంత్రి వివరించారు. రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు రైతులకు వరం. రైతులకు సాగు నీరు, 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే అని మంత్రి తెలిపారు.మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శం. కేంద్ర ప్రభుత్వం తీసుకు వస్తున్న రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకించాలి. కరోనా కష్టకాలంలో సంక్షేమ పథకాలు అందించిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని ఎర్రబెల్లి దయాకర్ వివరించారు.

జనగామ జిల్లా లోని మొదటి వైకుంఠధామం గూడూరులో ప్రారంభించడం సంతోషంగా ఉందని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. వైకుంఠధామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దిన సర్పంచ్, మాజీ సర్పంచ్, గ్రామస్తులను మంత్రి అభినందించారు. ప్రభుత్వ నిధులతో పూర్తి చేసిన నిర్మాణాలకు తోడుగా ఆ గ్రామ ప్రజలు వైకుంఠధామం అనేక సదుపాయాలు హంగులను సమకూర్చారు. గందె లక్ష్మమ్మ రామయ్యల స్మారకార్థం గందె సోమయ్య అర ఎకరం స్థలం ఇచ్చారు. గూడూరుతో పాటు ఆ చుట్టు గ్రామాల కు ఉపయోగపడే విధంగా కొసన వెంకట నరసింహారెడ్డి రెండు లక్షలు, ఏల మూర్తి 1,60,000, పూజారి రమాకాంత్ 50,000, చిన్న రామ్ రెడ్డి 25,000, పొన్నాల సోమిరెడ్డి 25,000 సమకూర్చి పరమపద వాహనాన్ని సిద్ధం చేశారు. ఆ వాహనానికి అవసరమైన షెడ్‌ను కుంట శ్రీకాంత్ నిర్మించారు. కేవలం డ్రైవర్ ఖర్చు 500 వాహన ఖర్చు ఐదు వందలతో ఈ వాహనాన్ని ఎవరైనా వినియోగించుకునే వీలు కల్పించారు. గ్రామంలోని ఒగ్గు కళాకారులు బృందం 30 వేల రూపాయలతో హరిశ్చంద్ర విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గందె రాజు ఫ్రీజర్‌ను సమకూర్చారు. బలిజ సోమయ్య, అప్పారావు కలిసి శివుడి విగ్రహాన్ని అందజేశారు. గ్రామంలోని 50 మంది దాతలు తల 10,000 చొప్పున విరాళాలు అందించారు. దీంతో వైకుంఠ ధామానికి అనేక సదుపాయాలు సమకూరాయి. ఈ మొత్తం పనులని ఆ గ్రామ మాజీ సర్పంచ్ పుల్లయ్య సమన్వయం చేశారు.

అయితే గ్రామస్తుల సహకారంతో సర్వాంగసుందరంగా నిర్మితమైన గూడూరు వైకుంఠధామం మొత్తం రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి వారిని అభినందించారు. మనసుంటే మార్గం ఉంటుంది అని, గ్రామాల్లో దాతలకు కొదవలేదని, చొరవ తీసుకునే వారు ఉంటే ఎలాంటి కార్యాన్నైనా సాధించే వీలు ఉందని చెప్పడానికి నిదర్శనమే గూడూరు వైకుంఠధామం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొనియాడారు. వైకుంఠ భావానికి సహకరించిన వాళ్లని మంత్రి అక్కడే సత్కరించారు. అంతకుముందు మంత్రికి గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో లో గ్రామదర్శిని లు లు మండల స్థానిక ప్రజా ప్రతినిధులు మహిళలు పాల్గొన్నారు.