దిగ్గజాల సరసన అశ్విన్‌..

200
- Advertisement -

టీమిండియా ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ సాధించిన అశ్విన్ టెస్టుల్లో రెండు వేల పరుగుల మార్కును చేరాడు. టెస్టుల్లో 2 వేల ప‌రుగులు, 250 వికెట్లు అత్యంత వేగంగా అందుకున్న ప్లేయ‌ర్‌గా చ‌రిత్ర సృష్టించాడు. 51వ టెస్ట్ ఆడుతున్న అశ్విన్‌ కెరీర్‌లో 11 హాఫ్ సెంచ‌రీలు, 4 సెంచ‌రీలు చేశాడు.

ఇక టెస్టుల్లో 2 వేల ప‌రుగులు, 250 వికెట్లు తీసుకున్న నాలుగో భార‌త ప్లేయ‌ర్‌గా అత‌డు నిలిచాడు. క‌పిల్ దేవ్‌, హ‌ర్భ‌జ‌న్‌సింగ్‌, అనిల్ కుంబ్లే త‌ర్వాత ఈ ఘ‌న‌త సాధించిన నాలుగో ఇండియ‌న్ ప్లేయ‌ర్ అశ్విన్‌. అంతేకాదు వ‌ర‌ల్డ్ క్రికెట్‌లో 2 వేల ప‌రుగులు, 200 వికెట్లు అత్యంత వేగంగా అందుకున్న వారిలో అశ్విన్ స్థానం నాలుగు. ఇయాన్ బోథ‌మ్, ఇమ్రాన్ ఖాన్‌, క‌పిల్ దేవ్ త‌ర్వాత అశ్విన్ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో అశ్విన్ 52 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు.

Ravichandran Ashwin completes 2000 runs in Test cricket

శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీసేన భారీ స్కోరు నమోదు చేసింది. 158 ఓవర్లకు 622/9 వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. భారీ లక్ష్యంతో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన శ్రీలంకకు శుభారంభం దక్కలేదు. అశ్విన్‌ (2/38) దెబ్బకు రెండో ఓవర్‌ చివరి బంతికి ఉపుల్‌ తరంగా పరుగులేమీ చేయకుండానే పెవిలియన్‌ చేరాడు. నిలకడగా ఆడుతున్న కరుణరత్నె (25; 45 బంతుల్లో 2×4)ను కూడా అశ్వినే ఔట్‌ చేశాడు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సరికి శ్రీలంక 50/2తో నిలిచింది.

- Advertisement -