మా నాయకుడు కోహ్లీనే : రహానే

76
rahane

ఆసీస్ గడ్డపై టీమిండియా అద్భుత ప్రదర్శన కనబర్చి సిరీస్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. రహానే నాయకత్వంలో టీమిండియా అసాధారణ ఆటతీరును కనబర్చడంతో రహానేను పూర్తిస్ధాయి కెప్టెన్‌గా నియమించాలనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో స్పందించారు రహానే.

భారత జట్టుకు కోహ్లి మాత్రమే నాయకుడని..తాను వైస్ కెప్టెన్‌ని మాత్రమేనని వెల్లడించాడు రహానే. జట్టులో హోదాకంటే అప్పజెప్పిన పనిని ఎంత బాగా చేశామనేదే ముఖ్యమనదే తన అభిప్రాయమని వెల్లడించిన రహానే.. జట్టుకు ఇలాంటి విజయాలు అందించేందుకు ఇంకా ప్రయత్నిస్తా అని వెల్లడించాడు.

తనకు, కోహ్లికి మధ్య మంచి అనుబంధం ఉంది. ఎన్నోసార్లు అతను నా బ్యాటింగ్‌ను ప్రశంసించాడని గుర్తుచేశాడు రహానే. ఇద్దరం కలిసి విదేశాల్లో జట్టు కోసం పలు చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడాం. అతను నాలుగో స్థానంలో, నేను ఐదో స్థానంలో ఆడటం వల్ల పలు మంచి భాగస్వామ్యాలు నమోదయ్యాయని వెల్లడించాడు. కెప్టెన్, టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నాపై నమ్మకముంచింది. ఫామ్‌ తాత్కాలికం అని నేనూ నమ్ముతాను. కొన్నిసార్లు వరుసగా విఫలం కావడం జరుగుతుంది. దానర్థం అతనేమీ ఆటను మరచిపోయినట్లు కాదని అభిప్రాయపడ్డాడు రహానే.