ఆగష్టులో పవన్ వస్తున్నాడట..

195
- Advertisement -

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయ సభలు.. ఇటు సినిమాలతో యమ బిజీగా ఉన్నాడు. ప్రజా స‌మ‌స్యల‌పై పోరాటంతో పాటు, పార్టీని బ‌లోపేతం చేయాల‌ని పవణ్ కళ్యాణ్‌ నిర్ణయించుకున్నారు. ఇటీవల త్రివిక్రమ్‌తో సినిమా మొదలు పెట్టాడు పవన్‌. ఈ సినిమా అనుకున్న సమయానికి షెడ్యూల్ మొదలైంది. జెట్ స్పీడుతో షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

Pavan Kalyan New Movie First Look

కాని ఈ సినిమాకు సంబంధించి మాత్రం ఇప్పటిదాకా ఏ విశేషం బయటికి రాలేదు. దీని టైటిల్ కూడా ఇప్పటిదాకా ప్రకటించలేదు. ఫస్ట్ లుక్ కూడా రాలేదు. దీంతో పవన్ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే త్వరలోనే పవర్ స్టార్ ఫ్యాన్స్ ను మురిపించబోతున్నట్లు సమాచారం. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా పవన్-త్రివిక్రమ్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేస్తారట. అప్పుడే టైటిల్ కూడా అనౌన్స్ చేయబోతున్నట్లు సమాచారం.

దీనిపై రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. ఈ చిత్రానికి ఇంజినీర్ బాబు అని.. గోపాల కృష్ణుడు అని.. పరదేశ ప్రయాణం అని.. ఇలా రకరకాల టైటిళ్లు ప్రచారంలో ఉన్నాయి. ఈ పేర్లతో ఫ్యాన్ మేడ్ పోస్టర్లు కూడా బయటికి వచ్చాయి. మరి వీటిలో ఏదైనా ఒక టైటిల్ ను త్రివిక్రమ్ ఫైనలైజ్ చేస్తాడా.. లేక కొత్త టైటిల్ ఎంచుకుంటాడా అన్నది చూడాలి.

- Advertisement -