కరోనా టీకా వేయించుకున్న టీమిండియా కోచ్ రవిశాస్త్రి..

148
ravi shastri
- Advertisement -

దేశంలో రెండవ దశ కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగాంగా ప్రధానితో సహా పలువురు ప్రముఖులు కొవిడ్‌ టీకా వేయించుకున్నారు. తాజాగా టీమిండియా కోచ్ రవిశాస్త్రి కరోనా టీకా వేయించుకున్నారు. మంగళవారం గుజరాత్ లోని అహ్మదాబాద్ అపోలో ఆస్పత్రిలో మొదటి డోసు తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ లో పంచుకున్నారు. టీకా తీసుకుంటున్న ఫొటోను పోస్ట్ చేశారు. కరోనాతో పోరులో వైద్యులు, శాస్త్రవేత్తల ఘనతను కొనియాడారు. వారికి కృతజ్ఞతలు తెలిపారు.

‘‘కరోనా టీకా మొదటి డోసు తీసుకున్నా. మహమ్మారిపై పోరులో భారత్ ను మరింత శక్తిమంతంగా మార్చిన అద్భుతమై వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు. అహ్మదాబాద్ అపోలోలోని కాంతాబెన్ ఆమె సిబ్బంది.. కరోనా వ్యాక్సినేషన్ ను ముందుకు తీసుకెళ్తున్న తీరు చాలా చాలా బాగుంది. వారి పనితీరు మెచ్చుకోదగినదిగా ఉంది’’ అని ఆయన ట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం ర‌విశాస్త్రి వ‌య‌సు 58. వ్యాక్సినేష‌న్‌ రెండో ద‌శ‌లో భాగంగా 60 ఏళ్లు దాటిన వారితోపాటు దీర్ఘ‌కాలిక వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న 45 ఏళ్లు పైబ‌డిన వారికి వ్యాక్సిన్ ఇస్తున్న విష‌యం తెలిసిందే.

- Advertisement -