ఇక్కడ ఎదిగి అక్కడ ఒదుగుతుంది

155
- Advertisement -

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా సౌత్ లో ఎదిగి నార్త్ లో ఒదుగుతుంది. బాలీవుడ్‌లో ఆమె నటించిన మిషన్ మజ్ను ప్రమోషన్‌లో భాగంగా మాట్లాడుతూ ‘‘సౌత్ సాంగ్స్‌ కంటే నార్త్ సాంగ్స్ బాగుంటాయి. చిన్నప్పటి నుంచి నేను బాలీవుడ్ సాంగ్స్ వింటూ పెరిగాను. దక్షిణాది సినిమాల్లో అన్నీ మసాలా పాటలే. ఐటం నెంబర్స్, డ్యాన్స్ నెంబర్సే ఎక్కువ’’ అంటూ దక్షిణాది పాటలను ఎద్దేవా చేసింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

రష్మీక టాలీవుడ్ పై చేసిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు. పరోక్షంగా ఇక్కడ దర్శకులను కూడా విమర్శించింది ఆమె. అలాగే ఓ హీరోను పరోక్షంగా టార్గెట్ చేసి డీగ్రేడ్ చేసింది. అయినా తెలుగు ఫిల్మ్ మేకర్స్ రష్మీక ను దూరం పెట్టరు. గతంలో టాలీవుడ్ పై ఓ రేంజ్ లో విమర్శలు చేసి, ఇండస్ట్రీని చీప్ గా చూసిన తాప్సిని, ఆ తర్వాత టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ మళ్లీ ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు రష్మికను కూడా అలాగే ఎంకరేజ్ చేస్తారు.

కానీ, రష్మిక మందన్నా.. టాలీవుడ్ పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను, ఫన్నీ కామెంట్స్ ను నెటిజన్లు వదిలి పెట్టడం లేదు. వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అయినా హిందీ సినిమా రాగానే తెలుగు సినిమా పై చిన్న చూపు చూడటం కొత్తేమీ కాదు. గతంలో జయప్రద, శ్రీదేవి దగ్గర నుంచి నేటి తాప్సీ, రష్మిక వరకూ ఎందరో సౌత్ సినిమాల పై నోరు పారేసుకున్న వారే.

ఇవి కూడా చదవండి..

- Advertisement -