సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా, సమంత హీరోయిన్‌గా, ఆదిపినిశెట్టి కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం రంగస్థలం. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఇప్పటికే విడుదలైంది. చెర్రీ, సమంత ఫోటోస్ కూడా సోషల్ మీడియా వేదికగా విడుదలై వైరల్ అవుతున్నాయి. మైత్రీ మూవీ పతాకంపై నిర్మించబడుతున్న ఈ సినిమా 1980 జరిగిన కథా నేపథ్యంలో రూపుదిద్దుకుంటోంది.
2018 మార్చిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలె ఈ సినిమాను చూశారట మెగాస్టార్ చిరంజీవి. సినిమాలో డీ గ్లామర్ అంశాలు ఎక్కువగా వున్నాయని, వాటిని కాస్త తగ్గించమని సుకుమార్ కు సూచించినట్లుగా ట్రేడ్ టాక్. దీంతో పాటు కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేయాలని చిరు సలహా ఇచ్చాడట. ఇక ఈ సినిమా కథ గతంలో తాను చేసిన ‘ఊరికిచ్చిన మాట’ ఛాయల్లో ఉండటాన్ని కూడా చిరంజీవి గమనించారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.
1981లో ‘ఊరుకిచ్చిన మాట’ చిత్రంలో చిరంజీవి, మాధవి నటించారు. ఎం.బాలయ్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అప్పట్లో ఈ చిత్రంబాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది. చిరు చిత్రంలోని కొన్ని సన్నివేశాలను స్ఫూర్తిగా తీసుకుని సుకుమార్ ‘రంగస్థలం’ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.