బావ రికార్డు బద్దలుకొట్టిన బన్ని..

401
bunny
- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన్న సినిమా ‘అల వైకుంఠపురములో…’ వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ సినిమా ఇది. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫిస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. మొదటి షో నుండి ఇప్పటి వరకూ మూవీ కలెక్షన్స్‌తో రికార్డులు క్రియేట్ చేస్తోంది. కేవలం తెలుగు స్టేట్స్‌లోనే కాదు..ఓవర్సీస్‌లోనూ బన్ని దుమ్ము దులుపుతున్నాడు.

ALVP

‘అల వైకుంఠపురములో’ యూఎస్‌లో అరుదైన రికార్డు నెలకొల్పింది. 3.52 మిలియన్ డాలర్ల వసూళ్లతో..నాన్ ‘బాహుబలి’ రికార్డును సాధించింది. బాహుబలి సిరీస్ తర్వాత రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ యూఎస్‌లో హయ్యిస్ట్ గ్రాసర్‌గా ఉంది. ‘అల వైకుంఠపురములో’ మూవీతో తన బావ రికార్డునే బద్దలుకొట్టాడు బన్ని. పూజా హెగ్డే హీరోయిన్ నటించిన ఈ మూవీకి తమన్ అదిరిపోయే సంగీతం అందించగా.. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా మూవీని నిర్మించాయి.

- Advertisement -