మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్-సమంత కాంబినేషన్‌లో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రంగస్థలం. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దృశ్యకావ్యంలా మలిచేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు సుకుమార్. గతంలో గ్రామీణ నేపథ్యంలో వచ్చిన చాలా సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో సరికొత్తగా 1985 నాటి కాలాన్ని తలపిస్తూ సుకుమార్ తీస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇటీవల వైజాగ్‌లో నిర్వహించిన రంగస్ధలం ప్రీరిలీజ్‌కు మంచి స్పందన వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి ఈ వేడుకకు హాజరై సినిమా బాగుందని ప్రశంసలు గుప్పించారు. ఈ సినిమాకు అవార్డుల పంట ఖాయమని చెప్పుకొచ్చారు. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న రంగస్ధలం యు/ఏ సర్టిఫికెట్‌ని పొందింది.
ఇప్పటివరకు విడుదల చేసిన రామ్ చరణ్,సమంత ఫస్ట్ లుక్స్ అందరిని ఆకట్టుకుంది.ఇక పాటల సంగతి చెప్పనక్కర్లేదు. ఫ్యాన్స్‌ని పాటలు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.ఈ సినిమాలో చరణ్‌కి అన్నయ్యగా కె.కుమార్ బాబు పాత్రలో ఆది కనిపించనున్నాడు. ఆనాటి కాలాన్ని తలపించేలా ఉన్న సెట్టింగ్స్‌తో సినిమాపై అంచనాలను మరింతగా పెంచేశాడు సుకుమార్. టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్ సృష్టించేందుకు వస్తున్న రంగస్ధలంతో సుకుమార్ చేసే మ్యాజిక్ ఏంటో తెలుసుకోవాలంటే మార్చి 30 వరకు వేచిచూడాల్సిందే.
Rangasthalam Certifited with U/A and releasing on march 30th #RangasthalamOnMarch30th pic.twitter.com/hmLW2M3R5J
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) March 26, 2018