జూ..లో మనిషి..? చూసేందుకు ఎగబడుతున్న జనం..!

275
Human Face Monkey Video Viral In Social Media..
- Advertisement -

ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఓ కోతి వైరల్‌ అవుతోంది. ఎంతగా అంటే..తక్కువ కాలంలోనే సోషల్‌ మీడియాలో 8మిలియన్లమంది ఆ వింత కొతిని చూరారట. అంతలా హల్చల్‌ చేస్తోంది ఆ కోతి. కాదు కాదు..ఆ మనిషిని పోలిన కోతి. అవును.. ఆ కోతి అచ్చం మనిషిలాగే ఉంది. దాంతో దాన్ని చూసినవారంతా ఒక్కసారిగా అవాక్కవుతున్నారు.

ఆ కోతి హావభావాలు కూడా అచ్చం మనిషిలానే ఉండడంతో ఆ వింతకోతి అందరినీ ఆకర్షిస్తోంది. అయితే ఈ కోతిని చైనా రాజధాని బీజింగ్‌లోని తియాంగ్‌ జంతుప్రదర్శనశాలలో చూడవచ్చు. ఇది చాలా అరుదైన బ్రీడ్‌కు చెందిన కోతి జాతికి చెందినదిగా కొంతమంది భావిస్తున్నారు. అయితే ఈ కోతికి మనుషులను కూడా అనుకరించడం తెలుసునని జూ అధికారులు చెబుతున్నారు. ఇక ఈవింత కోతిని చూడడానికి ఔత్సాహితులు ఉత్సాహాన్ని చూపిస్తున్నారు.

ఇదిలా ఉంటే..కోతినుంచే మనిషి ఉద్బవించాడని చెబుతుంటారు. అందుకే కాబోలు కొన్ని కొన్ని సందర్భాల్లో..మనుషులు చేసే పనులను కోతి చేష్టలతో పోల్చుతుంటారు.

- Advertisement -