దేశ చరిత్రలో సువర్ణాధ్యాయం: మోదీ

68
modi

దేశ ప్రజల సంకల్పబలంలోనే రామమందిర నిర్మాణం సాధ్యమవుతోందన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. అయోథ్యలో రామాలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన అనంతరం మాట్లాడిన మోడీ..రామమందిరం కోసం ఎందరో పోరాటం చేశారని తెలిపారు. రామమందిరం కోసం ఎంతోమంది బలిదానాలు చేశారని…కోటాను కోట్ల హిందూవులకి ఈ ఆలయం ముఖ్యమైందన్నారు.

వందల ఏళ్ల నిరీక్షణ ఇవాళ ఫలించిందన్నారు. వారందరి త్యాగాలతో రామమందిర నిరమాణం 130 కోట్ల మంది భారతీయుల తరపున వారందరికీ ధన్యావాదాలు తెలిపారు. జై శ్రీరామ్ అంటూ ప్రసంగం ప్రారంభించారు మోడీ.

దేశ చరిత్రలో ఇదో సువర్ణ అధ్యాయం..దశాబ్దాల పాటు రామ్‌లల్లా ఆలయం టెంట్‌లోనే కొనసాగిందన్నారు. స్వాతంత్ర్యం కోసం దేశమంతా పోరాటం జరిగింది వారి పోరాట ఫలితంగా ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు.రాముడు భారతదేశ మర్యాద..హనుమంతుడి ఆశీస్సులతో ఈ కార్యక్రమం జరిగిందన్నారు.

రామజన్మభూమిలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారని ఈరోజు దేశమంతా రామమయం అయిందన్నారు. రామమందిరానికి భూమిపూజ చేయడం తన అదృష్టమన్నారు.