మొక్కలునాటిన ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్ ఛైర్మన్ సురేష్..

49
gic

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా శ్రీనివాస హ్యచరీస్ ఎం.డి. , ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్ ఛైర్మన్ , సురేష్. ఆర్. చిట్టూరి జూబ్లీ హీల్స్ లోని తన నివాసంలో మూడు మొక్కలు నాటారు.

మహాలక్ష్మీ గ్రూప్ ఛైర్మన్ , యార్లగడ్డ హరిశంద్ర ప్రసాద్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించిన తాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నానని తెలిపారు.ఇంత మంచి కార్యక్రమములో తనను భాగ స్వామిని చేసిన హరిశంద్ర ప్రసాద్ గారికి మరియు , ఇంతటి పవిత్ర కార్యాన్ని నిర్వహిస్తున్న జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ క్రమంలో, దీనిని ముందుకు తీసుకుపోయేందుకు, తన వంతుగా మరో ముగ్గురిని మూడు మొక్కలు నాటాల్సిందిగా ఛాలెంజ్ విసిరారు. వారిలో పామ్ ఎక్సోటికా ఛైర్మన్ సందీప్ , పారిశ్రామిక వేత్తలు అమీన్ , పర్వేజ్ లు ఉన్నారు.