కాంగ్రెస్‌ ఇంద్రవెల్లి సభ…చంపినోడే శవానికి దండేసినట్లు?

147
revanth reddy

ఇంద్రవెల్లి..40 ఏళ్ల నెత్తుటి మరక. జల్,జమీన్ , జంగిల్ నినాదంతో సరిగ్గా ఇదే రోజు ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లిలో నిరసనకు దిగారు ఆదివాసీలు. వీరిపై అప్పటి ప్రభుత్వం(కాంగ్రెస్‌) ఆదేశాలతో తుపాకీ మోత మోగించారు పోలీసులు. దీంతో మణ్యం నెత్తుటి మరకలతో తడిసిముద్దైంది. ప్రభుత్వ లెక్కలు 13 మంది చనిపోయారని తెలపగా వాస్తవానికి వందకు పైగానే గిరిపుత్రులు నెలకొరిగారు. ఇంకా వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. 40 ఏళ్లైనా ఇంకా ఆ నెత్తుటి జ్ఞాపకాలు ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి. ఇదంతా జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే.

సీన్ కట్ చేస్తే…చంపినోడే శవానికి దండేసినట్లు…ఆ నెత్తుటి గాయానికి కారణమైన పార్టీనే ఇప్పుడు ఇంద్రవెల్లి సభ పేరుతో మోసం చేయడంపై ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇంద్రవెల్లి ఘటనకు కారణమైన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఏనాడూ కనీసం స్తూపం వద్ద నివాళులర్పించే అవకాశాన్ని కూడా ఇవ్వలేదు..కానీ ఇవాళ సభ పేరుతో ప్రజలను మోసం చేయడంపై మండిపడ్డారు ఎస్సీ,ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు రాంబల్ నాయక్.

అడవిపై హక్కు తమదని అడిగిన ఆదివాసీలను పిట్టలను కాల్చినట్లు కాల్చి చంపి నేడు అదే అమరవీరుల సమాధుల మీద సభను నిర్వహించడం సిగ్గుచేటని మండిప్డారు. ఆదివాసీల నెత్తుటి మరకలను కాంగ్రెస్ తుడవగలదా అని ఆయన ప్రశ్నించారు. అధికారంలో ఉన్న ఏనాడూ ఆదివాసీల అభివృద్ధి పట్టించుకోని కాంగ్రెస్ ఇప్పుడు దండోరా పేరుతో వారిపై జాలి చూపడం అమరుల త్యాగాలను అపవిత్రం చేసినట్లేనని దుయ్యబట్టారు.