రామాలయం కోసం 30 ఏళ్లుగా మౌనవ్రతం!

42
- Advertisement -

అయోధ్యలో రామాలయం..దశాబ్దాల భారతీయుల కల. ఈ నెల 22న ఆ కల నెరవేరబోతోంది. 2019 లో సుప్రీం కోర్టు తీర్పుతో శాంతియుతంగా బాబ్రీ మసీదు వివాదం సమసిపోగా అప్పటి నుండి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక అయోధ్యలో కొలువుదీరనున్న శ్రీరాముడి విగ్రహాన్ని చూడాలని యావత్ ప్రపంచం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది.

అయోధ్యలో రామ మందిర నిర్మాణం కట్టే వరకు మాట్లాడబోనని 30 ఏళ్ల క్రితం ఓ మహిళ శపథం చేసింది.ఈ నెల 22న రామాలయం ప్రారంభం జరగున్న నేపథ్యంలో ఆ బామ్మ తన మౌన వ్రతాన్ని వీడనుంది.జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌ జిల్లాలోని కరమ్‌తాండ్‌లో ఉంటున్న సరస్వతి అగర్వాల్, వయస్సు 86.

అయోధ్యలో రామ మందిరం నిర్మించే వరకు తాను ఎవరితోనూ మాట్లాడబోనని 30 సంవత్సరాల క్రితం మౌనవ్రతం చేపట్టింది. ఈ క్రమంలో జనవరి 22 వ తేదీన అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠాపన జరగనున్న వేళ అయోధ్యకు చేరుకోనున్న సరస్వతి…అదే రోజు మౌన వ్రతాన్ని వీడనున్నారు.

సరస్వతీ అగర్వాల్ దేవ్‌కీనందన్ అగర్వాల్‌ను పెళ్లి చేసుకున్నారు. వారిద్దరూ 65 ఏళ్ల పాటు సంసార జీవితాన్ని గడిపారు. అయితే సరస్వతీ అగర్వాల్ ఎప్పుడూ పాఠశాలకు వెళ్లకపోయినా.. ఆమె భర్త చదవడం నేర్పించారు. ఆమె భర్త 35 ఏళ్ల క్రితం మృతి చెందగా.. వారికి ముగ్గురు సంతానం.

Also Read:Ram Temple:రాముడి విగ్రహ ఊరేగింపు రద్దు

- Advertisement -