అందరిచూపూ అయోధ్య వైపే..

237
ayodhya
- Advertisement -

అపూర్వఘట్టం నేడు ఆవిష్కృతం కానుంది. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ఇవాళ భూమి పూజ చేయనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. భూమి పూజ జరిగే సమయంలో దేశమంతా సంబరాలు నిర్వహించేలా ఏర్పాట్లు జరిగాయి.

శ్రీరామచంద్రుడు పుట్టిపెరిగిన చారిత్రక, పురాణ పుణ్యభూమి అయోధ్య దివ్యకాంతులతో వెలిగిపోతోంది. సరిగ్గా మధ్యాహ్నం 12.30 గంటలకు ఆలయ నిర్మాణానికి వెండి ఇటుకతో పునాది రాయి వేయనున్నారు మోడీ. మూడున్నర సంవత్సరాలలో ఆలయ నిర్మాణం పూర్తికానుంది.

కరోనా నేపథ్యంలో భక్తులెవరినీ అయోధ్యలోకి అనుమతించటంలేదు. కేవలం 175 మంది వీవీఐపీలు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరుకానుండగా స్ధానిక ప్రజలతో పాటు దేశమంతా టీవీల్లోనే ఈ కార్యక్రమాన్ని తిలకించేలా శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఏర్పాట్లు చేసింది.

అయోధ్య వీధులన్నీ అద్దాల్లా మెరుస్తున్నాయి. ఇండ్లన్నీ రామాయణ ఇతివృత్త చిత్రాలతో మెరిసిపోతున్నా యి. నగర గుళ్లన్నీ భజనలు, కీర్తనలతో మార్మోగుతున్నాయి. నగర గుళ్లు, మసీదులు అన్నీ బుధవారం తెరిచే ఉంటాయని, అయితే రామాలయ భూమిపూజ తప్ప మరే కార్యక్రమం జరుగరాదని పోలీసులు ఆదేశాలు జారీచేశారు.

- Advertisement -