సేతుబంధాసనంతో ఆ సమస్యలన్నీ దూరం!

124
- Advertisement -

శరీరాన్ని, మనసును ఆరోగ్యంగా ఉంచుకోవడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ప్రతిరోజూ యోగా చేయడానికి సమయం కేటాయించాలని నిపుణులు చెబుతుంటారు. ప్రతిరోజూ యోగా చేయడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. యోగాలో సులభతరమైన ఆసనాలు అలాగే కష్టతరమైన ఆసనాలు చాలానే ఉన్నాయి. సులభతమైన ఆసనాల ద్వారా కూడా చక్కటి ఆరోగ్య ఫలితాలను పొందవచ్చు. ఏ వయసు వారైనా ఎంతో సులభంగా వేయగల ” సేతుబంధసనం ” గురించి తెలుసుకుందాం !

సేతుబంధాసనం వేయు విధానం
ముందుగా నేలపై లేదా యోగా షీట్ పై వెల్లకిల పడుకోవాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకొని శ్వాసక్రియ నెమ్మదిగా జరిగిస్తూ రెండు కాళ్ళను మడిచి నడుము భాగాన్ని పైకి లేపాలి. ఆ తరువాత రెండు చేతులతో రెండు కాళ్ళ మడమలను పట్టుకోవాలి. కాళ్ళు 90 డిగ్రీల కోణంలో త్రిభుజకరంలో నడుము భాగంను పైన ఫోటోలో చూపిన విధంగా ఉంచాలి. ఈ స్థితిలో 20-30 పాటు ఉంటూ మూడు నుంచి నాలుగు సార్లు ఈ ఆసనం వేయాలి.

ఉపయోగాలు
సేతుబంధాసనం వేయడం వల్ల మానసిక ఒత్తిడి దూరమై మనసు ప్రశాంతంగా ఉంటుంది. దాంతో నిద్రలేమి వంటి సమస్యలు దూరం అవుతాయి. ముఖ్యంగా ఊబకాయంతో భాదపడుతున్న వారికి ఈ ఆసనం ఒక వరం లాంటిది. ఈ ఆసనం వేయడం వల్ల త్వరగా బరువు తగ్గుతారని యోగా నిపుణులు చెబుతున్నారు. ఈ ఆసనం ద్వారా నడుము పై భాగానికి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. తద్వార బ్యాక్ పేయిన్ వంటి సమస్యలు దూరం అవుతాయి. ఈ ఆసనం ప్రతిరోజూ వేయడం వల్ల పొట్ట చుట్టూ పెరుకుపోయిన కొవ్వు త్వరగా తగ్గుతుంది. అలాగే ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -