Ram Mandir:వేద మంత్రాల మధ్య బాలరాముని ప్రాణప్రతిష్ట

15
- Advertisement -

500ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. వేల మంది ప్రత్యక్ష, కోట్ల మంది పరోక్ష వీక్షణ మధ్య అభిజిత్ లగ్నంలో ప్రధాని నరేంద్రమోడీ అయోధ్య ఆలయలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 84 సెకన్లలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం పూర్తయింది. వేద మంత్రాల మధ్య బాల రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం పూర్తయింది. ప్రధానితో పాటు పూజలో పాల్గొన్నారు ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్. స్వామివారికి పట్టు వస్త్రాలు, వెండి గొడుగు సమర్పించారు ప్రధాని.

అయోధ్య రామాలయాన్ని సంప్రదాయ నాగర శైలిలో నిర్మించారు. 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తుతో నిర్మించారు. ప్రతి అంతస్తు 20 అడుగుల ఎత్తులో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆలయ నిర్మాణంలో 392 స్తంభాలు, 44 గేట్లు ఉన్నాయి.

అయోధ్యలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠ సందర్భంగా రామ మందిరాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. పూలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అయోధ్య మొత్తం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతోంది. రామ మందిర ప్రారంభోత్సవానికి 7వేల మంది అతిథులను ఆహ్వానించారు.

Also Read:ఓటీటీ : ఈ వారం చిత్రాల పరిస్థితేంటి ?

- Advertisement -