సంక్రాంతి బరిలో రామ్… ‘రెడ్’

35
red

ఇస్మార్ట్ శంకర్ హిట్‌తో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కిన నటుడు రామ్ పోతినేని. తాజాగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రెడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీ సంక్రాంతి బరిలో నిలిచింది.

క్లీన్ u/a సర్టిఫికేట్ పొందిన ఈ చిత్రం జనవరి 14న ప్రేక్షకుల ముందుకురానుంది. రామ్ సరసన నివేదా పేతురాజ్‌, మాళవిక శర్మ, అమృత అయ్యర్‌ హీరోయిన్లుగా నటించారు. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిశోర్ నిర్మించారు.

వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయినా థియేటర్‌లలోనే విడుదల చేసేందుకు ఇన్ని రోజులు ఆగారు. క్రైమ్ థ్రిల్లర్‌ జానర్‌లో రూపొందిన ఈ సినిమాలో హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ స్పెషల్ సాంగ్ చేసింది. రామ్ రెండు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించనున్నారు.