రాష్ట్రంలో 24 గంటల్లో 472 కరోనా కేసులు..

28
coronavirus

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 472 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇద్దరు మృతిచెందారు.దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,84,863కు చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 6579 యాక్టివ్ కేసులుండగా 2,76,753 మంది రికవరీ అయ్యారు. 1531 మంది కరోనాతో మృతిచెందారు.. దేశంలో కోవిడ్ మరణాల శాతం 1.4 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.53 శాతానికి తగ్గింది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా టెస్ట్‌ల సంఖ్య 67,23,710కు పెరిగినట్టు ప్రభుత్వం పేర్కొంది.