ఆర్జీవీని భ‌య‌పెడుతోన్న క‌రోనా వైర‌స్

66
rgv

వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ క‌రోనా వైర‌స్ పై స్పందించాడు. ఈ నేప‌థ్యంలో క‌రోగా గురించి ప‌లు ఆస‌క్తిక‌ర ట్వీట్లు చేస్తున్నాడు. ఎప్ప‌డు షూటింగ్ ల‌లో బిజిగా ఉండే వ‌ర్మ ఇంట్లో ఉండాలంటే క‌ష్ట‌మే అని చెప్పుకోవ‌చ్చు. తాజాగా ఆయ‌న చేసిన ట్వీట్ ఆస‌క్తిరేపుతోంది.

కాలాన్ని కూడా కరోనా నిలిపివేసిందని, కరోనా తీరు చూస్తుంటే భయం వేస్తోందని పేర్కొన్నారు. ఇప్పుడేం చేయాలి కరోనా? నెలకు 30 రోజులేమో ఉంటాయని ఎప్పుడూ అనుకునేవాడ్ని, కానీ, ఫస్ట్ టైమ్ నెలకు 1000 రోజులు ఉన్నట్టుగా అనిపిస్తోంది. టైమ్ అస్సలు కదలడంలేదు. ఏదేమైనా లాక్ డౌన్ పనిచేస్తోందని, దానిముందు కరోనా పనిచేయడంలేదని తెలుస్తోంది” అంటూ స్పందించారు. దేనికి భ‌య‌ప‌డ‌ని వ‌ర్మ క‌రోనాకు ఇంత‌లా భ‌య‌ప‌డుతున్నాడ‌ని ఆర్జీవీ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.