హైద‌రాబాద్ లో రెడ్ జోన్లు లేవుః జీహెచ్‌ఎంసీ కమిషనర్‌

285
Ghmc comissioner Lokesh Kumar
- Advertisement -

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కమిషన్‌ పరిధిలో రెడ్‌ జోన్లు లేవని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ తెలిపారు. చందానగర్‌, ఫిలింనగర్‌తో పాటు నగరంలోని పలు ప్రాంతాలను రెడ్‌జోన్‌గా ప్రకటించారని వాట్సాప్‌లో వైరల్‌ అవుతున్న ప్రచారం అవస్తవమన్నారు. రెడ్‌ జోన్‌ ఉన్నట్లు మార్ఫింగ్‌ చేసిన ఫ్లెక్సీలు పెడుతున్నారన్నారు.

హైదరాబాద్‌ జిల్లాలో రెడ్‌ జోన్‌ ఎక్కడా ప్రకటించలేదన్నారు. అవాస్తవాలు ప్రచారం చేసేవారిపై కేసులు పెడతామని హెచ్చరించారు. ప్రజలందరూ లాక్‌డౌన్‌కు సహకరిస్తున్నారని తెలిపారు. కొందరు దఫదఫాలుగా కుటుంబ సభ్యులతో బయటకు వస్తున్నారు. అలాంటి వారి వల్లనే సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందన్నారు.

- Advertisement -