రైతుబంధు స‌మితి జిల్లా అధ్య‌క్షుల‌తో ప‌ల్లా టెలికాన్ఫ‌రెన్స్

193
palla
- Advertisement -

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షుడు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో కరోనా వ్యాధి కట్టడి చేయడంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని మార్కెట్ కొనుగోలు కేంద్రాలను మూసి వేయడం జరిగింది .. ఈ సందర్భంగా గ్రామాల పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతు పండించిన పంట గ్రామ కొనుగోలు కేంద్రాలు తరలించడంతో పాటు వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంలో జిల్లా, మండల మరియు గ్రామాల రైతుబంధు సమితి అధ్యక్షులకు క్రియాశీలక పాత్ర నిర్వహించాలని కోరారు.

ఈ సందర్భంగా జిల్లాల‌ అధ్య‌క్షుల‌కు ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి ప‌లు సూచ‌న‌లు చేశారు.ప్రతి గ్రామ కొనుగోలు కేంద్రంలో గోనెసంచులు కాంటాలు మరియ టార్పాలిన్ ( తాడిపత్రి) తగు సంఖ్యలో ఏర్పాటు చేసుకోవాలి.ధాన్యం తీసుకుని వచ్చే రైతులు గుమికూడకుండా సామాజిక దూరం పాటించాలి. కొనుగోలు కేంద్రాల వద్ద చేతులు శుభ్రం చేసుకోవడానికి తగు విధముగా సబ్బులు , సనీటైజర్ మరియు నీటిని ఏర్పాటు చేసుకోవాలి.

వరి, మొక్కజొన్న కోత యంత్రాలను గ్రామాలలో కి రావడానికి తగు అనుమతులను తీసుకోవడానికి రైతులకు సహాయ సహకారాలను అందించాలి.వెటర్నరీ మందుల దుకాణాలను, విత్తన, ఎరువుల మరియు పురుగు మందుల దుకాణాలను తెరిచి ఉంచే విధముగా చర్యలు తీసుకోవాలి.వ్యవసాయ కూలీలను అవసరమైన చోట ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి తరలించే విధంగా అనుమతులు తీసుకోవాలి. పశువుల దాన తరలించే వాహనాలను గ్రామాలలో కి అనుమతించే విధముగా చర్యలు తీసుకోవాలి.

రైతుబంధు సమితి సభ్యులు తమ గ్రామాలలోనీ రైతులు పండించిన పంటంతా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందనే భరోసా కలిగించాలి అని రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షులు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు కోరడం జరిగింది.

- Advertisement -