మెగా ఫ్యాన్స్‌కు రాంచరణ్‌ లేఖ

33
ram

మెగా ఫ్యాన్స్‌కు లేఖ రాశారు సినీ నటుడు రాంచరణ్‌. కరోనా వేళ చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకు స్ధాపించి తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో సేవ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్‌కు లేఖ రాశారు చెర్రీ.

అభిమానులు ఈ కోవిడ్ 19 మహమ్మారి సమయంలో కష్టపడి చేస్తున్న ఈ సమాజ సేవ గురించి నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నాను.అత్యవసర పరిస్థితిలో ఉన్న సామాన్యుడికి సహాయం చేయడం నుండి ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వరకు మీరు ఎంతో అంకితభావంతో పని చేశారని ప్రశంసలు గుప్పించారు. ఎన్నో వ్యయప్రయాసలు కూర్చి ఎందరికో సహాయం చేసిన మీ అందరికీ పేరుపేరున నా శుభాభినందనలు. మీ అందరి అంకితభావానికి నా ధన్యవాదాలు అని లేఖలో తెలిపారు.